తెలంగాణవరంగల్

అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హనుమకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసాపై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి చెప్పారు. వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని భట్టి గుర్తు చేశారు. ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తేల్చి చెప్పారు. ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.

Read Also : కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. రైతులకు అందించే భరోసా సొమ్ము ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించినవేనని అన్నారు. అందుకే ప్రతి పైసా సక్రమంగా వినియోగం కోసం అన్నివర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు.రైతులకు అందించే భరోసా సొమ్ము ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించినవేనని అన్నారు. అందుకే ప్రతి పైసా సక్రమంగా వినియోగం కోసం అన్నివర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, 12 నియోజకవర్గాల ఎంఎల్ఎలు, ఎంఎల్సి, ఎంపి, రైతు సంఘం నాయకులు హాజరయ్యారు.

Also Read : వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్

రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇన్సురెన్స్ కంపెనీలతోను చర్చలు జరుపుతున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశామని రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. వచ్చే ప్రతీ చిన్న ఆదాయాన్ని పోగుచేసి ప్రజలకే పంచుతామని చెప్పారు. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా వస్తుందని చెప్పారు. త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. రైతు భరోసాతో పాటు ఇన్‌ఫుట్ సబ్సిడీ లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!
  2. రోడ్డుపై వింత చేపలు.. చూసేందుకు ఎగబడిన జనం!!
  3. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!
  4. యదాద్రిలో ప్రారంభమైన వన మహోత్సవం, గిరిప్రదక్షిణ…
  5. యువత సన్మార్గంలో నడుచుకోవాలి…-వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్

Related Articles

Back to top button