క్రైమ్తెలంగాణనల్గొండ

అక్రమ గంజాయిని విక్రయిస్తున్న 5గురు నిందితుల అరెస్ట్…

  • -వీరి వద్ద నుండి సుమారు రూ.25 వేల రూపాయల విలువ గల (5 ప్యాకెట్లలో)
  • 1 kg గంజాయి, 4 సెల్ ఫోన్ లు, 2 బైక్ లు స్వాధీనం.

చండూరు, మునుగోడు, క్రైమ్ మిర్రర్:

మునుగోడు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలను తెలిపిన ఎస్పి నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి…

A-1బొల్లo వెంకటేష్, తండ్రి సైదులు, వయస్సు: 24 సంవత్సరములు, వృత్తి: వ్యవసాయం మరియు గ్రామ దేవతల పండగలకు డప్పు కొట్టడం, గ్రామం: కోరటికల్, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా.

A-2 దోటి రామరాజు, తండ్రి యాదయ్య, వయస్సు: 20సంవత్సరములు,వృత్తి: డెలివరీ బాయ్ (షాడో ఫాక్స్), గ్రామం: కురంపల్లి గ్రామం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా.

A-3 అరునెల్లి వికాస్ వర్ధన్ @ డాన్, తండ్రి రవి, వయస్సు: 26 సంవత్సరములు, వృత్తి: బైక్ మెకానిక్ గ్రామం: కమ్మగూడెం గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా.

A-4 వీరమల్ల లింగస్వామి, తండ్రి పాపయ్య, వయస్సు: 25 సంవత్సరములు, వృత్తి: ఆటో డ్రైవరు గ్రామం:కొంపల్లి మునుగోడు మండలం, నల్గొండ జిల్లా.

A-5 పురం గణేశ్, తండ్రి నాగయ్య, వయస్సు 22 సంవత్సరాలు, వృత్తి సెంట్రింగ్ పని, బొల్లారం గ్రామం, గుర్రంపోడు మండలం.

కేసు వివరాలు క్రైమ్ నం:120 /2024 U/S 8 (c) r/w 20 (b)(ii) (A), 29 NDPS Act-1985 మునుగోడు పోలీసు స్టేషన్.
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో బాగంగా నల్లగొండ జిల్లాలో గౌరవ ఎస్‌పి శరత్ చంద్ర పవార్, IPS గారు నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో బాగంగా వారి ఆదేశాల ప్రకారం నల్లగొండ DSP గారి పర్యవేక్షణలో తేదీ: 20.07.2024 రోజు లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంతలోని షెడ్ వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి అమ్ముచున్నారన్న అని నమ్మదగిన సమాచారం మేరకు, మునుగోడు యస్.ఐ Ch. వెంకటేశ్వర్లు మరియు వారి సిబ్బంది తో యుక్తముగా ఉదయం దాదాపు 8.30 గంటల లక్ష్మీదేవి గూడెం వద్ద (5) మంది వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ లతో పశువుల సంత లోని షెడ్ అనుమానాస్పద స్థితిలో ఉండగా,యస్.ఐ  తన సిబ్బందితో యుక్తంగా పట్టుబడి చేసి, విచారణ చేయగా!

వారు తమ పేర్లు 1) బొల్లం వెంకటేశం, తండ్రి సైదులు, R/o కోరటికల్, 2) దొటి రామరాజు, తండ్రి యాదయ్య, R/o కురంపల్లి గ్రామం, చండూర్ మండలం, 3) అర్మేల్లి వికాస్ వర్ధన్, తండ్రి రవి, R/o కమ్మగూడెం H/o మునుగోడు గ్రామం, 4) వీరమల్ల లింగస్వామి, తండ్రి పాపయ్య, R/o కొంపల్లి గ్రామం మునుగోడు మండలం మరియు 5 ) పురం గణేశ్, తండ్రి నాగయ్య, R/o బొల్లారం గ్రామం, గుర్రంపోడు మండలం అని తెలిపి, ఇందులో 1) బొల్లం వెంకటేశం, తండ్రి సైదులు, R/o కోరటికల్, 2) దొటి రామరాజు, తండ్రి యాదయ్య, R/o కురంపల్లి గ్రామం, కనగల్ మండలం అనే వారు హైదరాబాద్ లోని ధూల్ పేట్ చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర (5) ప్యాకెట్లు లలో 200 గ్రాములు రూ. 2,000/- ల చొపున మొత్తం రూ.10,000/- గంజాయిని కొనుగోలు చేసి, మోటార్ సైకిల్ పై లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంత లోని షెడ్ వద్దకు తీసుకవచ్చి, వారి స్నేహితులకు తెలియపరిచగా, వారు అక్కడికి రాగా, వారు అట్టి గంజాయిని 200 గ్రాములు, చొప్పున తీసుకొని, గంజాయి త్రాగే వ్యక్తులకు అమ్ముదామని తీసుకపోవడానికి సిద్దంగా ఉండగా, పోలీసులు పట్టు బడి చేసి, వారి వద్ద నుండి అందాజ 1000 గ్రాములు గంజాయిని, (4) సెల్ ఫోన్ లు, మరియు గంజాయి రవాణా చేయుటకు ఉపయోగించిన Splendor plus bikeNo AP 28 BM 8929, Splendor bike No TS 05 FJ 5414 మరియు 4 సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకున్నారు.

ఇట్టి వ్యక్తులు తక్కువ ధరకు గంజాయిని దూల్పెట్, హైదరాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి, మునుగోడు చుట్టు ప్రక్కల వారకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇందులో బాగముగా 35 మంది భాదితులను గుర్తించి, వారిలో కొంత మందికి పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లుగా వచ్చినది మరియు అందరికి కౌన్సిలింగ్ చేయనయినది. ఇట్టి గంజాయిని కేసును ఛేదించిన నల్లగొండ డియస్పి కె.శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో చండూర్ సి.ఐ ఎ. వెంకటయ్య గారి ఆధ్వర్యంలో,మునుగోడు యస్.ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది రమేశ్, నర్సింహా, వెంకన్న, నాగేశ్వర రావు, ఆంజనేయులు, జానీ, మోహన్ లను జిల్లా యస్.పి గారు అభినందించారు.

Back to top button