ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

అక్టోబర్ 31 కాదు నవంబర్ 1న దీపావళి!

దీపావళి పండుగ తేదీపై వివాదం తెరపైకి వచ్చింది. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాకుండా నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని ధృక్ గణిత పంచాంగకర్తలు స్పష్టం చేస్తున్నారు.
కోనసీమ ప్రాంతానికి చెందిన భారతీయ తెలుగు ధృక్ గణిత పంచాంగకర్తల సమాఖ్య ఆధ్వర్యంలో 47 మంది పండితులు అమలాపురంలో సమావేశమై దీపావళి పండుగ తేదీని ఒకటో తేదీకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల ఆస్థాన పండితుల పంచాంగం అనుసరించి అక్టోబర్ 31న దీపావళి శెలవు ప్రకటించింది. అయితే పూర్వ పద్ధతి సిద్ధాంతం ప్రకారం రూపొందించిన పంచాంగాల కారణంగా తరచూ పండుగల తేదీల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని‌ చెప్పారు. ఇకనైనా తాము అనుసరిస్తున్న ధృక్ గణిత సిద్ధాంతంలోకి రావాలని పులిపాక చంద్రశేఖశర్మ, ఉపద్రష్ట నాగాదిత్య, గొర్తి పట్టాభిశాస్త్రి, కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి, ఉపద్రష్ట విక్రమాదిత్య తదితర పంచాంగకర్తలు కోరారు. ఈ ఏడాది అపరాహ్న అమావాస్య వచ్చిన నవంబర్ ఒకటో తేదీన దీపావళి జరుపుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించి రాష్ట్రానికి మంచి జరుగుతుందని ధృక్ పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

Back to top button