తెలంగాణ

అందాల భామల కోసం కాదు.. ప్రజల కోసం పని చేస్తం

మూసి ప్రక్షాళన విషయంలో అందం కోసం, అందాల భామల కోసం పని చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.మూసి పునర్జీవం కోసం పని చేస్తున్నామని చెప్పారు. మూసి సుదరికరణ కోసం ఈ మూసి ప్రక్షాళన చేయడం లేదు.. మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఈ ప్రోగ్రామ్ చేపట్టామని తెలిపారు.ఇది మూసి సుందరీకరణ కాదు…మూసి ప్రక్షాళన,మూసి పునర్జీవ ప్రాజెక్టు అన్నారు. మీరు కట్టిన ప్రాజెక్టు వద్దకు సెక్యూరిటీ సిబ్బంది లేకుండా నేను వస్తా…మీరు గతంలో ఏం చేశారు…మేము ఏం చేయబోతున్నమో చర్చిద్దామని సీఎం రేవంత్ సవాల్ చేశారు.

మూసి పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్,హరీష్ రావు, ఈటెల రాజేందర్ మూడు నెలలు ఉండండి.. రెంట్లు నిను కడతాను…అని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మూడు నెలల తర్వాత మూసి పరివాహక ప్రాంతాల్లో బాగా ఉంది అంటే మూసి పునర్జీవ ప్రాజెక్టు నిలిపి వేస్తామని చెప్పారు.బందిపోటు దొంగ దోపిడీ దొంగ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష 50 వేల కోట్లు అంటున్నారు దోచుకోవడానికే ఈ ప్రాజెక్టు అంటున్నారు.. 141 కోట్ల టెండర్ అగ్రిమెంట్లు 5 కంపెనీలకు ఇచ్చామన్నారు. విదేశీ నిపుణులను వాళ్లే తీసుకువస్తారు.. వాళ్లే పెట్టుబడులు తీసుకువస్తారని చెప్పరు. లక్ష 50 వేల కోట్లు ఎక్కడి నుండి వస్తాయి.. సుందరీకరణ ఎక్కడి నుండి వస్తుందని అన్నారు.

నాగరికతకు నగరాలకు విడదీయలేని బంధం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయాం అనే అక్కసు తో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాలుష్య నగరానికి గత పాలకులు మూసిని మార్చారన్నారు. మూసి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.1600 ఇండ్లు మూసి లోపల ఉన్నాయన్నారు. గతంలో ముప్పు ప్రాంత ప్రజలకు బి అర్ ఎస్ ప్రభుత్వం పునరావాసం చూపించలేదని.. తాము దారి ఖర్చులతో పాటుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. దసరా పండుగ సంతోషంగా చేసుకోవాలని మా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button