తెలంగాణ

విద్యుత్ షాక్ తో మహిళ మృతి.. అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు!!

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి : కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామానికి చెందిన కుర్రి రేణుక భర్త రాజు అనే మహిళ ఉదయం సుమారుగా 8 గంటల 30 నిమిషాలకు తన ఇంట్లో బట్టలు ఆరేస్తున్న క్రమంలో ఇనుప దండానికి విద్యుత్ ప్రవహించడంతో కరెంట్ షాక్ కొట్టి ఒక్కసారిగా ఇంటి బేస్మెంట్ పై పడడంతో తల బలంగా బేస్మెంట్ కు గుద్దుకొని కింద పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే శిక్షిత నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్స్ ఆమె చనిపోయిందని ధ్రువీకరించారు.. మృతురాలి భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు..

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్
  2. బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!!
  3. ప్రధాన మంత్రి మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. మోదీ, అమిత్ షాలకి పలు వినతి పత్రాల అందచేత!!
  4. ఫ్రీ బస్సు పథకం వల్ల టీజీఎస్ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం.. ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్!!
  5. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!

Back to top button