ఆంధ్ర ప్రదేశ్

విజయమ్మ హత్యకు జగన్ స్కెచ్? టీడీపీ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. వైఎస్ విజయమ్మ హత్యకు స్కెచ్ వేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయమ్మ కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ అనంతపురం వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కొత్త కారు టైర్ పేలడంతో అప్పుడే పలు అనుమానాలు వచ్చాయి. కారు పేలడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అన్న వాదనలు వచ్చాయి. ఆ ప్రమాదం తర్వాత విజయమ్మ అమెరికా వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. పోలింగ్ కు ముందు తన కూతురు వైఎస్ షర్మిలను ఆశీర్వదించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు విజయమ్మ.

తాజాగా విజయమ్మ కారు ప్రమాదం, ఆమె అమెరికా వెళ్లడంపై తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అఫిషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు జరిగినా ఈ ప్రమాదం యాధృశ్చికమా లేకా పక్కా ప్లానింగా అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల ముందు విజయమ్మ ఎక్కడికి పోయింది….? అసలు విజయమ్మ కీలక ఎన్నికల సమయంలో అమెరికా ఎందుకు వెళ్లినట్లు అని అందులో ప్రశ్నించింది.

షర్మిల గెలుపు కోసం వీడియో పంపిన విజయమ్మ..మరి జగన్ పార్టీ గెలుపు కోసం ఎందుకు అప్పుడు స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సందేహం వెలిబుచ్చింది. 2019లో ఎన్నికల్లో బాబాయ్ ను చంపినట్లు..ఈ ఎన్నికల్లో విజయమ్మపై స్కెచ్ వేశారా….? అంటూ టీడీపీ అధికారంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. టీడీపీ చేసిన ట్వీట్ కు కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. బాబాయ్ లానే తల్లిని హత్య చేసేందుకు జగన్ స్కెచ్ వేశారంటూ టీడీపీ అనుకూలురు పోస్టులు పెడుతున్నారు.

Back to top button