క్రైమ్

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్‌లో ఫుల్ ట్రాఫిక్ జాం

తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదంటూ కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న బెటాలియన్ పోలీసుల భార్యలు సాయంత్రం హైదరాబాద్ లో మెరుపు ధర్నాకు దిగారు. హైటెక్ సిటీ కొండాపూర్ సిగ్నల్ వద్ద 8వ బెటాలియన్ పోలీసుల భార్యలు ఒక్కసారిగా నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి రూట్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మా భర్తలకు డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారని పోలీసుల భార్యలు అవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరుచాలని డిమాండ్ చేశారు. తమ భర్తలలో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేపిస్తున్నారని ఆరోపించారు కానిస్టేబుళ్ల భార్యలు. పోలీసు డ్యూటీకి తమ భర్తలు చేస్తున్న పనికి సంబందం లేదని ఆరోపించారు.

ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ కొండాపూర్ 8 బెటాలియన్ గేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్న మహిళలు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లా ఎండ్ ఆర్డర్ పోలీసులకు వర్తించే రూల్స్ బెటాలియని పోలీసులకు వర్తింప చేయాలని నినాదాలు చేశారు. బెటాలియన్ విధానాన్ని తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడప్పుడు వచ్చే తండ్రిని చూసి పిల్లలు బంధువులుగా ఫిల్ అవుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు పోలీసుల భార్యలు. ఇంట్లో కుటుంబ సభ్యులల్లో ఆరోగ్యం బాగా లేకున్నా హస్పటల్ కు తిసుకోని పోయే పరిస్థితి లేదన్నారు.

కొండాపూర్ లో నిరసన దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బెటాలియన్ పోలీసుల భార్యల ఫోటోలు తీసి తర్వాత మీ సంగతి చూస్తా అని గచ్చిబౌలి సీఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆందోళనకు దిగారు నిరసన చేస్తున్న మహిళలు. మీకు తెలివి లేదా పోలీస్ జాబ్ లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునే ముందు అంటూ దూషణలకు పాల్పడ్డారు గచ్చిబౌలి పోలీసులు. దీంతో తమను దూషించిన గచ్చిబౌలి సీఐని సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై ఆందోళన ఉధృతం చేశారు పోలీసుల భార్యలు.

Back to top button