మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. చాదర్ ఘాట్ ఏరియాలోకి బుల్డోజర్లు వచ్చేశాయి. ఖాళీ చేసిన ఇళ్లను కూల్చి వేస్తున్నారు అధికారులు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్ , రసూల్ పురాలో RBX పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను కొందరు ఖాళీ చేసి వెళ్లారు. ఆ ఇండ్లను మార్కింగ్ చేసిన అధికారులు కూల్చేశారు. మూసీ పరివాహిక ఏరియాలో ఉన్న కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచల్ గూడలో ఉన్న ప్రభుత్వ 2BHK ఇళ్లను కేటాయించారు అధికారులు.