
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్ లో ఉన్నటువంటి KFC పై హిందూ రక్షా దళ్ నిరసనకు దిగింది. శ్రావణమాసంలో నాన్ వెజ్ అమ్మడం ఏంటని?.. రెస్టారెంట్ ఓనర్ల పై దాడి చేశారు. ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ దగ్గరలోని ఇందిరాపురంలో ఉన్న KFC రెస్టారెంట్ శ్రావణమాసంలో కూడా నాన్ వెజ్ ఆహారాన్ని అమ్ముతుండడంతో… ఆగ్రహించిన హిందూ రక్షా దళ్ నిరసనకు దిగారు. Kfc రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు… కొంతమంది పై అరుస్తూ షాపుని మూసివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు కొంతమంది అక్కడికి చేరుకొని కొంతమంది పై కేసు నమోదు చేశారు. కాగా శ్రావణమాసంలో నాన్ వెజ్ తినడం, తినకపోవడం వారి ఇష్టమని… అలాగని శ్రావణమాసంలో నాన్ వెజ్ షాపులు తెరుచుకుండా ఉండాలంటే ఎలా అని పోలీసులు వారిని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఇష్టానుసారంగా మీరు వారి షాపులపై దాడులు చేయడమేంటని కొంతమంది నెటిజెన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జూలై 11వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలైంది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు అయితే మాత్రం కచ్చితంగా శ్రావణమాసంలో ఒక్కరోజు కూడా చికెన్ తినడం చూసుండరు.