తెలంగాణ

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇండ్ల నుంచి బయటికి వస్తే ప్రమాదంలో పడే సూచనలు కన్పిస్తున్నాయి.
హైదారాబాద్ లో ఒక్కసారిగా పడిపోయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. కూకట్ పల్లి, మూసాపేట్, బాలానగర్ నాంపల్లి, మెహదీపట్నం లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం నమోదైంది.

ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో 300 క్రాస్ అయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. డిల్లీ కి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతున్న వైనం.
పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.సమస్య పై కనీసం దృష్టిపెట్టని GHMC, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇలాగే నమోదైతే చిన్నారులకు, వయోవృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందికరంగా హైదారాబాద్ వాతావరణం మారిపోనుంది.

కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. ట్రాఫిక్ కంట్రోల్ తప్పడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అవుతోంది. గంటలకొది వాహనాలు ట్రాఫిక్‌లో ఉండటంతో భారీగా కాలుష్యం పెరిగిపోయిందని చెబుతున్నారు. గతంలో ఏనాడు హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వంద పాయింట్లు దాటలేదని లెక్కలు చెబుతున్నాయి.

Back to top button