చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మండలం చామలపల్లి గ్రామంలో ప్రతి తొలి ఏకాదశికి శ్రీసీతారామాంజనేయ స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. బుధవారం తొలి ఏకాదశి కావడంతో శ్రీ సీతారామాంజనేయ స్వామి జాతరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మితో కలిసి వచ్చారు. దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన దంపతులకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.
12,608 Less than a minute