క్రైమ్

చండూరులో భారీ చోరీ

25 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణ

చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మున్సిపాలిటీలో ఓ ఇంట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎవరో గుర్తు తెలియని దొంగలు చండూర్ ఆంజనేయస్వామి గుడి దగ్గరలో ఉన్న మొగుదాల కవిత ఇంట్లోకి శుక్రవారం వెనుక నుండి ప్రవేశించి వారి ఇంట్లో బీరువలో దాచిన లాంగ్ చైన్, చంద్రహారం, నక్లెస్, చైన్, రింగ్ లు, చెవి కమ్మలు, బిస్కెట్ బంగారం మొత్తం కలిపి అందజా (25 తులాలా బంగారం), 50 తులాల వెండి, 70 వేల రూపాయలు నగదు ను దొంగలించారు. చోరీ జరిగే సమయంలో కవిత ఇంట్లో లేదు. రాత్రి దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి శనివారం కవిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Back to top button