
-
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు
-
రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయం
-
వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని వెల్లడించిన బొత్స
-
గతంలోనూ ఎన్డీయే అభ్యర్థికే ఓటేశామన్న బొత్స
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించబోయే తమ వైఖరిని వైసీపీ వెల్లడించింది. తమ ఓటు ఎన్డీయే అభ్యర్థికేనని జగన్ పార్టీ ప్రకటించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతివ్వబోతున్నట్లు తమ పార్టీ నిర్ణయించిందని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బీజేపీ నాయకులు తమను కలిసి మద్దతు కోరారని, ఈ మేరకు తాము సానుకూలంగా స్పందించామని బొత్స పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ వైసీపీ అని, తాము ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతివ్వబోమని బొత్స స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే… వైసీపీ మద్దతిచ్చిన విషయం బొత్స గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ మద్దతిచ్చిందని చెప్పారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని బొత్స చెప్పారు.
Read Also: