ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున మహా కుంభమేళాలో ఆర్ కే రోజా దర్శనమిచ్చారు. రోజా తన మిత్రులు మరియు సాధువులతో కలిసి త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. అక్కడ సాధువులు చెప్పినట్లుగా రోజా మరియు తన మిత్రులు పూజలు చేసి దీపాలను నీటిపై వదిలారు. అనంతరం అందరూ కలిసి గంగా మాతకు నమస్కారం చేసి పవిత్ర నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. చాలా సమయం పాటు రోజా మరియు తన మిత్రులు అందరూ కలిసి మహాకుంభమేళాలో కొద్దిసేపు పాటు సమయాన్ని గడిపారు.
కాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుండి కోట్లాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యోగి ఈ మహా కుంభమేళాకు దాదాపుగా 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే గడిచిన రెండు వారాలకే ఏకంగా 15 కోట్ల మంది వరకు భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా 45 రోజులు పాటు కొనసాగునుంది. ఈ మహా కుంభమేళా అనేది ఫిబ్రవరి 26వ తారీకున ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి
1.విచ్చల విడిగా నల్లమట్టి దందా..!? రైతుల పేరిట అనుమతులు లక్షల సొమ్ము మూట..!?
2.ఏపీలో దారుణం!.. తల స్నానానికి 100 రూ… పురుగుల అన్నం పెడుతున్నారు! కేజీబీవీ విద్యార్థులు ఫైర్??