
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కక్షపూరితంగానే వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కావాలని పదేపదే వంశీని రెచ్చగొట్టేలా టిడిపి నేత పట్టాభి మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం పట్టాభి రెచ్చగొట్టడం వల్ల టిడిపి ఆఫీస్ పై ఆరోజు జాడి జరిగిందని అన్నారు.
అప్పుడు టిడిపి పార్టీ చేసిన ఫిర్యాదులో వంశీ పేరు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్నామని ధీమాతో ఆ కేసును రీఓపెన్ చేసి వంశీకి బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు మార్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ఆఫీస్ పై దాడి జరిగిన కేసులో వల్లభనేని అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి