Friday, March 20, 2026
Homeజాతీయంకాసేపట్లో పోస్టుమార్టం, ఇంతలో అసలు యువకుడు ప్రత్యక్షం!

కాసేపట్లో పోస్టుమార్టం, ఇంతలో అసలు యువకుడు ప్రత్యక్షం!

UP Viral News: ఉత్తర ప్రదేశ్ లో జరిగిన వింత ఘటన గురించి వింటే అందరూ షాక్ కావాల్సిందే! కాసేపట్లో డాక్టర్లు పోస్టుమార్టం చేయాలనుకున్న యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

డెడ్ బాడీ తన తమ్ముడిదేనని చెప్పిన మహిళ

ఉత్తర ప్రదేశ్‌ లోని  దేహత్ జిల్లా, ఘాతమ్‌ పూర్ లో తాజాగా ఓ గుర్తు తెలియని శవం దొరికింది. పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలుసుకునేందుకు ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సాయంత్రం తర్వాత ఓ మహిళ ఘాతమ్ పూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని చెప్పింది. తరచుగా తన తమ్ముడు కూడా ఎరుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ వేసుకుంటాడని చెప్పింది. డెడ్ బాడీ ఎవరిదో తెలియడంతో పోలీసులు మితగా ప్రొసిజర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు.

కాసేపట్లో పోస్టుమార్టం అనగా షాకింగ్ ట్విస్ట్

కాసేపట్లో పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్ పూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడు చెప్పిన మాటలు విని పోలీసులు షాకయ్యారు. “సర్.. సర్ నా పేరు అజయ్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపేయండి” అని చెప్పాడు. ఆ మాటలు విని పోలీసుల నోట మాట రాలేదు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

మరి ఆ డెడ్ బాడీ ఎవరిది?

ఇక అజయ్ నుంచి పూర్తి వివరాలు సేకరించాడు. అసలైన అజయ్ తనేనని కన్ఫార్మ్ చేసుకున్నారు. వెంటనే వైద్యులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిలిపివేశారు. అటు ఆ గుర్తు తెలియని మృతదేహం ఎవరిది అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. త్వరలోనే అసలు మృతుడు ఎవరో కనిపెడతామని వెల్లడించారు.

Read Also: ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్, స్పాట్ లోనే ఏడుగురు..

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments