
క్రైమ్ మిర్రర్, తెలంగాణ న్యూస్:- తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలో ఒదిగిపోయి ఎంతో మందిని భయపెట్టి… మరి కొంతమంది ని నవ్వించిన ఒకప్పటి నటుడు, గబ్బర్ సింగ్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ ఈరోజు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని బోడుప్పల్ లో ఉన్నటువంటి ఆర్బిఎం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఫిష్ వెంకట్ చికిత్స పొందుతున్నాడు. ఫిష్ వెంకట్ కు రెండు కిడ్నీలు కూడా పనిచేయకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో ఈ వైద్యానికి అయ్యే డబ్బులు ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి లేవు. ఇంత వారందరూ ఆసుపత్రిలోని వెంటిలేటర్ దగ్గరే తీవ్ర దుఃఖానికి గురయ్యారు. ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏకంగా 50 లక్షల ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు మాకు సహాయం చేయాలని ఫిష్ వెంకట్ ఫ్యామిలీ చాలా మందిని ఆర్థికంగా వేడుకుంటున్నారు.
అయితే ఫిష్ వెంకట్ కు అయ్యే ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని తాజాగా మంత్రి శ్రీహరి ప్రకటించారు. అయితే మరోవైపు టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ ఫిష్ వెంకట్ చికిత్స కోసం రెండు లక్షల రూపాయలను పంపించారు. ఈ చెక్కు ను గబ్బర్ సింగ్ విలన్స్ టీం ఫోటోలు మరియు వీడియోలు ద్వారా సోషల్ మీడియాకు తెలిపారు. ఈ యంగ్ హీరో 2,00,000 పంపినట్లుగానే మిగతా హీరోలు కూడా ఫిష్ వెంకట్ కోసం సహాయం చేయాలని వేడుకున్నారు. మా ఫిష్ వెంకట్ కు రెండు లక్షల రూపాయల చెక్కును పంపిన హీరో విశ్వక్సేనుకు గబ్బర్ సింగ్ గ్యాంగ్ మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.
విపరీతమైన కార్మిక కొరతతో ఇటలీ… మా దేశానికి వస్తే ఉద్యోగాలు ఇస్తాం?