ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పాలనపై ఫైర్ అయిన వైసీపీ నేతలు?

క్రైమ్ మిర్రర్, ప్రకాశం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అధికారంలో ఉన్న కోటను ప్రభుత్వంపై అలాగే చంద్రబాబు నాయుడు పై గిద్దలూరు ఇంచార్జ్ కేపీ నాగార్జున అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇద్దరు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసిపి ఇంచార్జ్ కేపీ నాగార్జున రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్న కూడా ఒక్క హామీనీ సరిగా నెరవేర్చలేక పోయిందని గిద్దలూరు ఇంచార్జ్ నాగార్జున రెడ్డి అన్నారు. తాజాగా జరిగినటువంటి అర్ధవీడు మండలంలో “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి కేపీ నాగార్జున మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అన్నారు. మొన్న తల్లికి వందనం పథకంలో దాదాపు 20 లక్షల మంది తల్లులకు డబ్బులు పడలేదని ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు కూటం ప్రభుత్వం పై ఒక అవగాహన వచ్చిందని.. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైసిపి మాజీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా తాజాగా గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అవినీతి సొమ్మును దాచుకునేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దుబాయ్ శీను లా సింగపూర్ చంద్రబాబు పేరు ఆయనదేనని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా వెంటనే సింగపూర్ వెళుతూనే ఉంటారని అన్నారు. అవినీతి సొమ్ము మొత్తం కూడా సింగపూర్లో దాస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button