ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి కే వెంకట్ రెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. కావాలనే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ యువకులకు బైక్ సైలెన్సర్లు తీసి మరి స్టంట్ లు చేయాలని చెప్పుకొచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడం కారణంగానే ఇద్దరు యువకులు ‘గేమ్ చేంజర్’ సినిమా ఈవెంట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా స్టంట్ లు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దర యువకులు మరణించడం జరిగింది. దానికి పక్కాగా కారణం పవన్ కళ్యాణ్ అంటూ వెంటనే పోలీసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించిన తెలంగాణ యువకుడు !.. కానీ ప్రభుత్వం నుండి నో సపోర్ట్?
పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో అలా చెప్పకపోతే ఇవాళ రెండు నిండు ప్రాణాలు మిగిలేవని అన్నారు. పవన్ కళ్యాణ్ అలా చెప్పడం కారణంగానే ఇద్దరు యువకులు స్టంట్ లు చేస్తూ మరణించడం అనేది ఆయన చెప్పడం కారణంగానే జరిగిందని కాబట్టి కచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా మరోవైపు తెలంగాణలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో భాగంగా ఒక మహిళ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి బాధ్యులుగా చేస్తూ హీరో అల్లుఅర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా మనందరికీ తెలిసిందే.
పెళ్లి కాని జంటలకు నో రూమ్స్.. ఓయో సంచలన నిర్ణయం
కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడం కారణంగానే ఇద్దరు యువకులు చనిపోవడం జరిగిందని కాబట్టి వైసిపి అధికారి ప్రతినిధి చెప్పింది నిజమే అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొంతమంది వైసీపీ నాయకులు కావాలనే ఇలా పకడ్బందీగా మాట్లాడుతున్నారన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడమేంటి అని, ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ ఎలా అవుతారని చాలామంది కామెంట్లు చేస్తూ సపోర్ట్ గా నిలబడ్డారు . ఇక తాజాగా ఇదే తరహాలో గేమ్ చేంజింగ్ ఈవెంట్ కి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువకులు చనిపోవడం కూడా పవన్ కళ్యాణ్ ను బాధ్యులుగా చేస్తున్నారు.