ఆంధ్ర ప్రదేశ్

వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు: అంబటి

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 2024వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. మేము ఓడిపోయాం… కాదు ఘోరంగా ఓడిపోయాం కానీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏకంగా 164 సీట్లు సాధించింది కానీ అన్ని సీట్లు రావడం కూటమి ప్రభుత్వ కార్యకర్తలకే ఆశ్చర్యకరంగా ఉందని, అన్ని సీట్లు ఎలా వచ్చాయనేది వాళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం కాలేదని అన్నారు.

ది గ్రేట్ క్రికెట్ గాడ్ సచిన్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు?

కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి అధ్యక్షుడు నరేంద్ర మోడీ అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి రావడం వల్ల ఇంత ఘోరంగా ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సరే వైసిపి పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వం చేసిన ఎన్నో మంచి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయని ఎప్పటికీ కూడా అవి ప్రజలు మర్చిపోరని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని అలాగే ఇచ్చిన హామీలను ఇంకా సరిగా నెరవేర్చలేదని అన్నారు. ఇక ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు మరియు 25 ఎంపీ స్థానాలను వచ్చే ఎలక్షన్లలో గెలిచేలా జగన్ పునర్నిర్మానం చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు.

ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button