ఆంధ్ర ప్రదేశ్

పవన్, లోకేష్ కంటే పోసాని ఎక్కువగా బూతులు తిట్టారా?: అంబటి రాంబాబు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. పోసానిని కూటమి ప్రభుత్వం ఎక్కువగా వేధిస్తుందని ఉన్నారు. పోసాని నీ అరెస్టు చేయించి కూటమి ప్రభుత్వం దుర్మార్గ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అరెస్టు చేయడం, కోర్టులో ప్రవేశ పెట్టడం, రిమాండ్ కు తరలించడం అనేది వెంటనే రాత్రికి రాత్రి జరిగిపోయాయని… అలా ఎలా చీకటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ఎలుకల కాట్లు .. విద్యార్థులకు ఘాట్లు…!

పోసానివి చెడు మాటలు అయితే పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ మాట్లాడే మాటలు మంచి మాటలా?.. అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ కంటే ఎక్కువగా పోసాని బూతులు తిట్టారా?.. అని ప్రశ్నించారు. పోసానికి ఎల్లవేళలా కూడా వైసిపి పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వంలో పోసాని పవన్ కళ్యాణ్ ను అలాగే నారా లోకేష్ ను తీవ్రంగా బూతులు తిట్టిన విషయం మనందరికీ తెలిసిందే.

గ్రామ సం’గ్రామం’లో స్థానిక పోరు… యువతదే తొలి మెట్టు

గులాబీ గూటికి తీన్మార్‌ మల్లన్న – ఆ వీడియోల వెనుక అర్థం అదేనా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button