![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-39.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత అయినటువంటి వల్లభనేని వంశీని తాజాగా పోలీసుల అరెస్ట్ చేశారు. ఎస్సీ మరియు ఎస్టి అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఆయన నలుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇవాళ విజయవాడ తరలిస్తున్నారు. అలాగే వల్లభనేని వంశీ పై బిఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) పోలీస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ పడమటి పోలీసులు వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది.
యదాద్రిలో ప్రారంభమైన వన మహోత్సవం, గిరిప్రదక్షిణ…
వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య ప్రెస్ మీట్లలో ఏ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని మీటింగ్లు పెట్టడం వల్ల వైసిపి కార్యకర్తల్లో జోషు వచ్చిందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక రాష్ట్రంలో వరుసగా వైసిపి మాజీ ఎమ్మెల్యేలపై అరెస్ట్ వారింట్స్ జరగడంతో వైసిపి నాయకులు కూడా కూటమి గవర్నమెంట్ పై విమర్శలు వెదజల్లుతున్నారు. రాబోయేది జగన్ పాలన అని దాదాపుగా 30 సంవత్సరాలు పాటు అధికారంలోకి ఉంటామని జగన్ తెలపడం, ఒకసారి మేము అధికారంలోకి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టమని అంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సెగ గాలులు తగులుతున్నాయి.