భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం యోగా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అయితే తాజాగా త్వరలోనే ధ్యాన దినోత్సవం కూడా రాబోతుందట. నేటి ప్రజలు నిత్యం కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై విపరీతమైన ఒత్తిడితో ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యం మరియు ప్రశాంతత కోసం యోగాతో పాటుగా ధ్యాన దినోత్సవం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు చేశారు భారతదేశ అధికారులు. అయితే ఈ ప్రతిపాదనను ఆమోదించింది ఐరాస.
అయితే అప్పట్లో యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు పది ఏళ్ల కిందట భారతదేశంలో ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. కాబట్టి మనం ప్రతి ఏటా కూడా యోగ దినోత్సవం అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇకపోతే తాజాగా ధ్యాన దినోత్సవం కూడా నిర్వహించేందుకు భారతదేశం తో పాటు వివిధ దేశాలు కూడా తీర్మానాలు ముందుకు తీసుకురావడంతో ఇక ఐక్యరాజ్యసమితి కూడా జనరల్ అసెంబ్లీలో ఏగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రతి ఏటా డిసెంబర్ 21 వ తారీఖున “ప్రపంచ ధ్యాన దినోత్సవం” జరుపుకోవాలని తెలిపారు. అయితే ఈ డిసెంబర్ 21వ తారీకున ధ్యాన దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనే సందేహాలకు కూడా సమాధానం చెప్పారు. మన భారతదేశ సంప్రదాయాల ప్రకారం శీతకాలం తరువాత అంటే ఉత్తరాయణం లో అడుగుపెట్టి రోజు కావడంతో చాలా పవిత్రమైనదిగా భారతీయులు కొలుస్తారు కాబట్టి తేదీని ప్రకటించారు. ఇక దాదాపుగా 193 మంది సభ్యులు ఉన్నాయికి రాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారంనాడు సమావేశమై దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక ఈ ఐక్యరాజ్యసమితి సమావేశంలో మన భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మెక్సికో, పోర్చుగల్, బల్గేరియా లాంటి పలు దేశాలు ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆమోదించడానికి కృషి చేసాయి.