
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ :- వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మండలం, ఖైతాపురం గ్రామానికి చెందిన గోపనబోయిన లింగస్వామి డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే రాత్రి 09:00 గంటలకు వారంతా భోజనం చేసి నిద్రపోయాక, 26న మధ్యరాత్రి 12:30 గంటలకు లింగస్వామి మేల్కొని చూడగా అతని భార్య లావణ్య (27), కనబడలేదు. చుట్టుప్రక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త లింగస్వామి పోలీసులను ఆశ్రయించాడు. భర్త గోపనబోయిన లింగస్వామి బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సిఐ మన్మథ కుమార్ తెలియజేశారు. భర్త గోపనబోయిన లింగస్వామి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8712662744,
8712662481 నెంబర్ల కు సమాచారం అందించగలరని సిఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి