
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తెలంగాణ రాష్ట్రంలోని హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా హుస్సేన్ సాగర్ లో మహాభారత ఫౌండేషన్ చేపట్టిన ‘ భారతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన బాణ సంచాలు పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ భాణ సంచా పేలడం కారణంగా ఏకంగా రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి . అయితే అదే సమయంలో బోట్లలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా బయటకు చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బోట్లు దగ్ధం అయ్యే దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
1.దడ పుట్టిస్తున్న సైబర్ దాడులు!..ప్రతి రోజు వేల సంఖ్యల్లో కేసులు?
2.శ్రీచైతన్య విద్యా సంస్థలకు షాక్.. సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు