క్రైమ్

డాక్టర్ నిర్లక్ష్యం!.. బలైన మహిళ నిండు ప్రాణం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తాజాగా ఒక మహిళ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మైనపురి జిల్లాలో చోటుచేసుకుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని మైనపూరి జిల్లా ఆస్పత్రిలో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రవేశ కుమారి అనే 60 ఏళ్ల మహిళా వృద్ధురాలికి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అదే సమయంలో అక్కడ అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ కుర్చీలో దర్జాగా కూర్చుని నర్సులను ఏంటో చూడమని చెప్పి అతను సెల్ఫోన్లో రీల్స్ చూస్తూ ఉన్నాడు.

డబ్బులు లేవు… ఏమైనా చేసుకోండి?… ఫైబర్ నెట్ కు వార్నింగ్ ఇచ్చిన RGV!..

ఆదర్శ్ అనే డాక్టర్ అమ్మాయిల వృద్ధురాలని కనీసం చూడకుండా ఏమైందో తెలుసుకోండి అని నర్సులను పంపించడంతో నర్సులు ఆమెని పరిశీలిస్తున్నారు. అయితే వైద్యురాలు తరపున బంధువులు డాక్టర్ని వైద్యం చేయాలని కోరిన డాక్టర్ పట్టించుకోలేదు. దీంతో కేవలం ఐదు నిమిషాల పాటు చాతిలో నొప్పి కారణంగా విలవిలలాడుతూ ఆమె అక్కడికక్కడే మరణించింది. అది చూసిన బంధువులు తీవ్ర ఆందోళనకు గురై డాక్టర్ పై రెచ్చిపోయారు. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వలనే ఆమె చనిపోయిందంటూ చనిపోయిన మహిళా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో అక్కడ విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూడగా బాధితులు చెప్పిన విధంగానే అందులో రికార్డు అయింది.

రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే!…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button