హత్నూర, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి డిసెంబర్ 13 : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతొ ఒక మహిళ తన నిండు నూరేళ్ళ ప్రణాలను కోల్పోయింది. ఇంట్లో పని చేస్తుండగా విద్యుత్ షాక్ తలగడంతో మహిళా మృతి చెందిన సంఘటన నిన్నరాత్రి జరిగింది. నర్సాపూర్ మండలం ఎర్రగుంట్ల తాండ గ్రామపంచాయతీ పరిధిలోని బాల్య తాండలో నిన్న రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. చాయి తాగుదమని ఇంట్లో ఉన్న ఇంటి పాత్రల స్టాండ్ లో నుంచి గ్లాస్ తీస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అలావత్ అనిత (27) అనే మహిళా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అల్లు అర్జున్ ఖైదీ నంబర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?
ఇంట్లోకి వచ్చిన భర్త తన భార్యకు ఏమైందోనని చూడగా అరి చేతిలో కరెంట్ షాక్ తగిలి చేతులు నల్లబడడంతో కరెంటు షాకు తగిలినట్టు నిర్దారణకు వచ్చారు. వెంటనె తేలుకొని చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి చూడగా అప్పటికే ఆమె షాక్ తొ మరణించి నట్లు గుర్తించారు. ఈ విషయం ఆమె భర్త శ్రీనివాస్ నర్సాపూర్ పోలీసులకు పిర్యాదు చేసారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై విలేకరులు గ్రామస్తులను వివరాలు అడగగా ఆమె చనిపోవడానికి కారణం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమేనని తండాకు చెందిన భీమ్రావు అనే వ్యక్తి తెలిపారు.
హాస్పటల్లో క్రిస్మస్ రిహార్సల్స్ చేసిన నర్సులు!.. చివరికి?
తాండలోని ప్రతి ఇంటికి కరెంటు షాక్ వస్తుందని దీనివలన అనిత చనిపోయిందని తెలిపారు. చనిపోయిన అనితకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు భర్త శ్రీనివాస్ ఉన్నారు. తన భార్య చనిపోవడంతో తమ కుటుంబం అంత అనాదలుగా మారమని శ్రీనివాస్ బోరున విలపించారు. ఇట్టి విషయాన్ని సంబందిత విద్యుత్ శాఖ ఏఈ ని వివరణ అడగ్గా తన సిబ్బంది తొ విచారిరించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.