Mumbai Rape Attempt: ముంబైలో మహిళలు ఎంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఈ ఒక్క ఘటన చూస్తే అర్థం అవుతుంది. మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని ఆడవారి పట్ల ఆకతాయిలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది. కామాంధులు అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనలో వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను దుండగుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. స్థానికులు వచ్చి.. ఆ మహిళను కాపాడారు. అంతేకాక దాడికి యత్నించిన సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మీరా రోడ్డులో ఘోరం
ముంబై మీరా రోడ్ లో రాత్రి సమయంలో మహిళ కేకలు వేయడం చుట్టుపక్కల వారు విన్నారు. ఏమైందో అని చూసేందుకు జనం అక్కడి వచ్చారు. డ్రగ్స్ తీసుకున్న ఓ వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేయగా.. ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, కాపాడాలంటూ కేకలు పెట్టింది. అదే సమయంలో మహిళపై సదరు వ్యక్తి దాడికి యత్నించాడు. తొలుత వారిద్దరు తెలిసిన వారని దగ్గరకు వెళ్లలేదు. చివరకు మహిళపై దాడి జరుగుతున్నట్లు గమనించి.. వెళ్లి ఆమెను రక్షించారు.
मीरा रोड स्थित हटकेश में देर रात एक महिला पर जबरदस्ती का प्रयास किया जा रहा था, पर वहा मौजूद लोगो की मदत से, महिला ko बचाया गया! #mirabhayander #miraroad pic.twitter.com/XGTi3H2U38
— Parmanand Azamgarhi (@parmanandyadavv) November 29, 2025
కామాంధుడు పోలీసులకు అప్పగింత
అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో మీరా రోడ్ ప్రాంతంలో, ముఖ్యంగా రాత్రి సమయంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మహిళను కాపాడిన స్థానికులను అభినందిస్తున్నారు.





