
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్ లో పర్యటించడం కారణంగా దేశంలోని ఓ మంత్రి పదవి పోయింది. ఎలా అనుకుంటున్నారా?… అయితే మీరే తెలుసుకోండి. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్ లో పర్యటించిన మొదటి రోజు కోల్కత్తాలో కొన్ని గందరగోళపు పరిస్థితులు ఏర్పడ్డాయి. మెస్సి కోల్కతా లోని సాల్ట్ లేక్ స్టేడియానికి వస్తున్నాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అతను మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోయాడు అని.. అసలు మెస్సిని విఐపి పర్సన్స్ గుముగూడి ఉండడంతో ప్రేక్షకులు ఎవరూ కూడా మెస్సిని స్పష్టంగా చూడలేకపోయాము అని ఆగ్రహంతో రెచ్చిపోయిన ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంలోని కుర్చీలు, బాటిల్స్ అన్నీ కూడా మైదానంలోకి విసిరి వేశారు. పదివేల రూపాయలకు పైగా టికెట్లు పెట్టి కొనుక్కొని వచ్చినా కనీసం ఆయన్ని చూడలేకపోయామంటూ తీవ్రంగా ఫైర్ అయ్యి స్టేడియాన్ని అల్లకల్లోలం చేశారు. దీంతో అందరి ముందు పరువు పోయింది అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కన్నేర్ర చేశారు. ఇక సీఎం ఆగ్రహంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. అయితే మరోవైపు ఈ రాజీనామా చేయమన్నదే సీఎం మమతా బెనర్జీ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మెస్సి ఇండియా రాకతో ఒక మంత్రి పదవి ఊస్టింగ్ అవ్వడం ఆశ్చర్యకరంగా మారింది.
Read also : యువత భ్రమలో నుంచి బయటికి రావాలి?
Read also : తాతకు వచ్చే LIC పెన్షన్ తో జీవితాన్ని గడిపిన CSK జాక్ పాట్ ప్లేయర్?





