
Wine Shops Close: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం హైదరాబాద్ పరిధిలోనే వైన్ షాపులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు.
మద్యం దుకాణాలు ఎందుకు బంద్ అంటే?
ప్రస్తుతం హైదరాబాద్ లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం లోని మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. జూన్ 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరగనుంది. మరుసటి రోజు అంటే జూలై 14న రంగం, ఫలహార బండి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. 13న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా బోనాల పండుగ నిర్వహించుకోవాలన్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించే పనులు చేయకూడదన్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే బోనాల ఉత్సవాలను భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు.
Read Also: లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు