
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది ఎల్లుండికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తదుపరి 3 రోజుల్లో ఇది మరింత శక్తివంతమై కోస్తాంధ్ర తీర ప్రాంతాన్ని చేరుకోవచ్చని తెలిపింది.
ఈ ప్రభావంతో ఇవాళ రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అంతేకాకుండా రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్ష తీవ్రత మరింత పెరిగి, విస్తారంగా వానలు పడతాయని APSDMA స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, రైతులు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైభవ్‌ను టీమ్ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t