జాతీయంసినిమా

నన్ను పెళ్లి చేసుకుంటావా? విష్ణు ప్రియ ఫోన్ కాల్ వైరల్ (VIDEO)

బిగ్‌బాస్ లవ్ బర్డ్స్ అనగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే జంట పృథ్వీరాజ్ శెట్టి- విష్ణుప్రియ. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఈ ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ, సరదా గొడవలు, భావోద్వేగ క్షణాలు ఆ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బిగ్‌బాస్ లవ్ బర్డ్స్ అనగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే జంట పృథ్వీరాజ్ శెట్టి- విష్ణుప్రియ. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఈ ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ, సరదా గొడవలు, భావోద్వేగ క్షణాలు ఆ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరిద్దరి కంటెంట్ షోకు మంచి రేటింగ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పృథ్వీ, విష్ణుప్రియ కలిసి ఇంటర్వ్యూలకు వెళ్లడం, స్టేజ్ షోలలో జంటగానే కనిపించడం ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలకు దారి తీసింది. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదేమో అన్న చర్చ సోషల్ మీడియాలో బాగా నడిచింది. అంతేకాదు, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 షోలో కూడా ఇద్దరూ కలిసి పాల్గొనడంతో లవ్ ట్రాక్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్ శెట్టి ప్రముఖ టాక్ షో బిగ్ టీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూలో పృథ్వీ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, వ్యక్తిగత జీవితంలో తాను పొందిన అవమానాలు, బిగ్‌బాస్ అనుభవాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. ముఖ్యంగా విష్ణుప్రియతో తన బంధంపై చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇంటర్వ్యూలో భాగంగా సంక్రాంతి పండుగ గురించి యాంకర్ వర్ష ప్రశ్నించగా.. పృథ్వీ సరదాగా ఫెస్టివల్ అంటే వెజ్ ఉంటుందిగా అంటూ ఫన్నీ సమాధానం ఇచ్చాడు. దానికి వర్ష వెంటనే విష్ణుప్రియ పేరును ప్రస్తావిస్తూ సెటైర్ వేసింది. ఈ సరదా సంభాషణల మధ్య పృథ్వీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ స్పందించడంతో, వర్ష కొత్త అల్లుడు వస్తున్నాడన్నమాట అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

ఇదే సమయంలో అనూహ్యంగా విష్ణుప్రియ పృథ్వీకి ఫోన్ చేయడం ఇంటర్వ్యూకు హైలైట్‌గా మారింది. కాల్ లిఫ్ట్ చేసిన పృథ్వీ సరదాగా మాట్లాడుతుండగానే, విష్ణుప్రియ ఒక్కసారిగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ ప్రశ్న వేసింది. దీనితో షాక్ అయిన పృథ్వీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను అంటూ కాల్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే విష్ణుప్రియ కూడా సెటైర్ వేయడంతో స్టూడియో మొత్తం నవ్వులతో నిండిపోయింది.

ఫోన్ కాల్ తర్వాత యాంకర్ వర్ష మరో కీలక ప్రశ్న వేసింది. ఇప్పుడే విష్ణుప్రియ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏం చేస్తావు అని ప్రశ్నించగా, పృథ్వీ ఏమాత్రం తడబడకుండా తన సమాధానం ఇచ్చాడు. నాకంటే మంచివాడిని చూసుకుని పెళ్లి చేసుకో అని చెబుతాను. యాక్సెప్టెన్స్ ఉండాలి కానీ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు అంటూ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ వ్యాఖ్యలతో పృథ్వీ- విష్ణుప్రియ మధ్య ప్రేమ సంబంధం లేదని, కేవలం మంచి స్నేహమే ఉందని మరోసారి స్పష్టమైంది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పృథ్వీ మాటలు హర్ట్‌ఫుల్‌గా ఉన్నాయంటూ విమర్శిస్తుంటే, మరికొందరు ఆయన నిజాయితీని, క్లారిటీని మెచ్చుకుంటున్నారు. మొత్తంగా బిగ్‌బాస్ సీజన్ 8లో మొదలైన పృథ్వీ- విష్ణుప్రియ లవ్ ట్రాక్‌కు ఈ ఇంటర్వ్యూతో ఫుల్ స్టాప్ పడినట్టే. ఇప్పుడు విష్ణుప్రియ స్పందన ఎలా ఉండబోతుందో, వీరి స్నేహం భవిష్యత్తులో ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే.

ALSO READ: ‘అమెజాన్ పే’లో మరో కొత్త సేవలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button