
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో నిన్న మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇతను ఎంతో మంది స్టార్ హీరోలకు కరాటే నేర్పించారు. మన టాలీవుడ్ నటుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ ఇద్దరు కూడా ఇతని వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇతని వద్ద చిన్నప్పటినుంచి కరాటే మరియు కిక్ బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నారు. కాగా గత కొద్ది నెలలుగా హుస్సేని బ్లడ్ క్యాన్సర్ తో పోరాడి నిన్న తుది శ్వాస విడిచారు. అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా అమ్మాలని అనుకున్నారట. అయితే ఈ కరాటే శిక్షణ కేంద్రాన్ని తన శిష్యుడు పవన్ కళ్యాణ్ కొనుగోలు చేస్తే చాలా సంతోషిస్తానని ఆయన చివరి కోరికగా కొంతమందికి చెప్పారట. తన ఆవేదన పవన్ కళ్యాణ్ వరకు వెళ్తే తప్పకుండా సహాయం చేస్తాడని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ హుస్సేనీ తెలిపారట.
అయితే ఇంతలోనే నిన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్ కూ చికిత్స పొందుతూ మరణించారు. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ కు చేరిందో లేదో తెలియదు కానీ చాలామంది ప్రముఖులు ఇది మాస్టర్ చివరి కోరిక అని, తీరకముందే వెళ్లిపోయారని… కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విషయం గుర్తుంచుకొని ఆ శిక్షణ కేంద్రాన్ని కొనమని చాలా మంది కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాకుండా ప్రతిరోజు నాకు టి అందించేవాడు కూడా అని… హుస్సేనీ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని పవన్ కళ్యాణ్, నేను చాలాసార్లు చర్చించుకున్నామని హుస్సేని అన్నారు. ఇప్పటివరకు ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం సుమారు పదివేల మందికిపైగా ట్రైన్ అయ్యారట. ఆర్చరీలో వెయ్యి మందికిపైగా విద్యార్థులను హుస్సేనీ తయారు చేశారు.