ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?

చంద్రబాబు… ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయనకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాలుగో సారి సీఎంగా సేవలు అందిస్తున్నారు. విజన్‌ – 2047 అంటున్నారు. మరి అప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉంటుందా..? చంద్రబాబు సీఎంగా కొనసాగుతారా..? ప్రజలు ఆశీర్వదిస్తే ఏదైనా జరగొచ్చు. కానీ… చరిత్ర మాత్రం చంద్రబాబు… వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన దాఖలు లేవంటోంది. ఆ లెక్కేంటో ఒకసారి చూద్దాం.

1995 సెప్టెంబర్‌ 1వ తేదీన.. తన మామ ఎన్టీఆర్‌పై తిరుబాటు చేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు చంద్రబాబు. దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు, 11 మంది మంత్రుల అండతో… తొలిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 1999లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు 180 సీట్లు సాధించి అధికారం చేపట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండి.. వరుసగా రెండో దఫా ముఖ్యమంత్రి కావడంతో అదొక్కసారే. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ….. 2004, 2009లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ మరణం.. రాష్ట్ర విభజన జరిగిపోయాయి. రాజధాని లేకుండా విడిపోయిన రాష్ట్రానికి .. అనుభవం ఉన్న చంద్రబాబు అయితేనే న్యాయం చేస్తాడని నమ్మిన ఏపీ ప్రజలు.. ఆయనకు అధికారం కట్టబెట్టారు. 2011లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టి విజయం సాధించాయి. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా చరిత్ర చూసుకుంటే… చంద్రబాబు ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన దాఖలాలు ఒక్కసారి తప్ప.. ఇంకెప్పుడు జరగలేదు. ఆ సెంటిమెంట్‌ ప్రకారం చూస్తే… చంద్రబాబు 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

2004, 2019లో ఓడిపోవడానికి కారణం తానే అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే చెప్పారు. పాలనలో బిజీగా బిజీగా పార్టీని పట్టించుకోలేదని చెప్తున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయానని అన్నారు. పార్టీని, ప్రజలను సమన్వయం చేయలేకపోయానని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు తప్పు తెలుసుకున్నారా…? గతంలో జరిగిన తప్పులు రిపీట్‌ కాకుండా చూసుకుంటున్నారా..? అధికారంలో ఉన్నా కూడా పార్టీకి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఇప్పుడు ఆ పని చేస్తున్నారా..? ఏమో.. అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఫ్చూచర్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button