
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య రెండు టెస్టులు జరగగా చెరొకటి గెలిచాయి. ఇక ఎంతో ఉత్సాహంగా, ఉత్కంఠంగా సాగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఇంగ్లాండ్ గడ్డలోని లార్డ్స్ మైదానంలో ఈ మూడవ టెస్ట్ జరుగుతుంది. ఇప్పటికే నాలుగు రోజులు ఆట పూర్తి చేసుకోగా ఐదవ రోజు ఆట ఇవ్వాలా జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఈ చివరి రోజు 135 పరుగులు చేస్తే మూడవ టెస్టులో విజయం సాధించినట్లే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మరొకటి ఉంది. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఉంది. కేవలం ఆరు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. దీంతో ఆరు వికెట్లు కోల్పోకుండా భారత్ 135 పరుగులు చేస్తే నే విజయం ఖరారు అవుతుంది.
ప్రస్తుతం క్రీజ్ లో కెల్ రాహుల్ మాత్రమే ఉన్నారు. మరోవైపు నిన్న చివరి బంతికి వికెట్ పడడంతో ప్రస్తుతం పంత్ బ్యాటింగ్కు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వీరిద్దరూ చాకచక్యంగా ఆడి జట్టు ను విజయ తీరాలకు చేర్చితేనే భారత్ ఇకపై మరెన్నో విజయాలతో పాటు జట్టులోని సభ్యులందరికీ కూడా స్ఫూర్తి నింపినట్లు అవుతుంది. మరి ఎంతో హోరాహోరీగా జరిగేటువంటి ఇవాళ చివరి రోజు మ్యాచ్లో టీమిండియా 135 పరుగులు చేసి విజయం సాధిస్తుందా లేదా అనేది కామెంట్లు రూపంలో తెలియజేయండి. కాగా ఈరోజు మ్యాచ్లో కేఎల్ రాహుల్ చాలా కీలకంగా కానున్నారు.