
⦿ భారత పొరుగు దేశాల్లో హింసాత్మక ఘటనలు
⦿ నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లోనూ ఇదే పరిస్థితి
⦿ అరాచక శక్తులు కల్లోలం, ప్రజా ఆస్తుల విధ్వంసం
⦿ దేశాలు వదిలి పారిపోయిన అధినేతలు
⦿ భారత్ లోనూ అలర్లలకు కుట్రలు!
⦿ భారతీయ జెన్ జెడ్ వారి కపటవాదుల ఉచ్చులో చిక్కుతుందా?
గడిచిన కొద్ది సంవత్సరాలుగా భారత పొరుగు దేశాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. హింసాత్మక ఘటనలతో భగ్గున మండుతున్నాయి. ఆయా దేశాల్లోని యువత అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరగబడుతోంది. శ్రీలంక నుంచి మొదలుకొని, బంగ్లాదేశ్, మయన్మార్.. తాజాగా నేపాల్ వరకు ఇలాంటి పరిస్థితులే చూశాం.
ఆందోళనల పేరుతో అరాచకత్వం!
తాజాగా నేపాల్ లో అల్లకల్లోం జరిగింది. సోషల్ మీడియా బ్యాన్ తో మొదలైన జెన్ జెడ్ యువత ఆందోళన, చివరికి ఆదేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను తగలబెట్టే వరకు వెళ్లింది. మాజీ ప్రధాని సతీమణిని నిరసనకారులు కొట్టి చంపేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకు ముందు బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను గద్దె దింపేందుకు ఆందోళనలకు కొనసాగాయి. నిరసనకారులు చేసిన విధ్వంసం గురించి ఎంత తక్కువ చెప్పుఉంటే అంత మంచిది. ఇస్లామిస్టులు హిందూ, మైనార్టీలను ఊచకోత కోశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇళ్లు తగలబెట్టారు. ఆలయాలు కూలదోశారు. వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. చివరకు షేక్ హసీనా లో దుస్తులను ప్రదర్శించి పైశాచిక ఆనందం పొందారు. ఇక శ్రీలంకలోనూ అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి దొరికింది దోచుకెళ్లారు. చివరకు రాజపక్సే దేశం విడిచి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇక పాకిస్తాన్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అదో దశ, దిశ లేని అత్యంత ప్రమాదకరమైన దేశం.
భారత్ లో ఆ పరిస్థితిని ఊహించగలమా?
నిజానికి నేపాల్ సహా ఇతర దేశాల్లో జరిగిన విధ్వంస కాండను చాలా మంది ఖండించారు. నిరసన పేరిట ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని తప్పుబట్టారు. కానీ, మనదేశంలో కొంత మంది మేధావులు అక్కడి విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. కేంద్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ గా పని చేసిన ఖురేషీ లాంటి మేధావులు ఏకంగా ప్రజాస్వామ్య పోరాటంగా అభివర్ణించారు. కొంత మంది మరో అడుగు ముందుకేసి నేపాల్ లాంటి తిరుగుబాటు భారత్ లోనూ వస్తుందని కామెంట్స్ చేశారు. రావాలని కోరుకుంటున్నారు కూడా. వచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలూ చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇలాంటి పరిస్థితి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జెన్ జెడ్ కలిసి రాజ్యాంగాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఓట్ చోరీని ఆపాలంటూ ఉపన్యాసాలు ఇస్తూ.. ఇన్ డైరెక్ట్ గా భారత్ లోనూ అలాంటి కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
భారతీయ జెన్ జెడ్ కపటవాదుల మాటలకు రెచ్చిపోతారా?
మనదేశంలో పరిసర దేశాల్లో మాదిరిగా అల్లర్లు జరిగే అవకాశం ఉందా? రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో మన జెడ్ జెన్ ఉందా? భారత పార్లమెంట్ ను తగలబెట్టి, సుప్రీం కోర్టుకు నిప్పుపెట్టి, ప్రధాని, ఇతర మంత్రుల నివాసాలను ధ్వంసం చేసే ఆలోచన కలలోనైనా ఊహించగలమా? అంటే.. ముమ్మాటికి లేదు అనే చెప్పాలి. ఇండియాలో విపక్ష పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు చెప్పే మాటలు జనాలు విశ్వసించే పరిస్థితిలో లేదు. కులం, మతం, ప్రాంతం, రాజ్యంగం ప్రమాదం, ఓట్ చోర్ అంటూ.. ఎన్నికల్లో లబ్ది కోసం చేసే న్యూసెన్స్ ను పట్టించుకోవడం లేదు. నమ్మడం లేదు. వీళ్లు లేవనెత్తే అంశాలను అసలు జనాలు సమస్యల్లా జనాలు భావించడం లేదు. అదే సమయంలో భారత్ లోని మెజారిటీ ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు ఇష్టపడుతారు. అల్లకల్లోం సృష్టించాలనే ఆలోచన ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే ఇంతపెద్ద దేశం సమైక్యంగా ఉండేది కాదు. ఎప్పుడో విడిపోయేది. అరాచక శక్తుల ప్రయత్నం ఎప్పుడూ ఇక్కడ నెగ్గదు.
కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి!
ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో 1974 నుంచి ఇప్పటి దాకా జరిగిన నిరసనలు, వాటికి కారణం, ఆ ఆందోళనలకు నిధులు అందించిన నెల్ వర్క్ లు, అల్లర్లకు వెనుకున్న అదృశ్య శక్తులకు సంబంధించి పూర్తి సమాచారం భారత ప్రభుత్వం సేకరించాలి. దేశ వ్యతిరేక కుట్రలకు తావులేకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే!