
Gold Price Prediction: భారతీయ మహిళలు అత్యంత ఇష్టపే బంగారం ధరం పరుగులు పెడుతోంది. ఈ ఏడాదిలో రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. పసిడి ధర ఈ వారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత వారం ప్రారంభంలో ఎంసీఎక్స్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.94,951 దగ్గర ప్రారంభమైంది. వారాంతంలో ఈ ధర రూ.97,830 దగ్గర ముగిసింది.
రూ. లక్షకు చేరనున్న బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఔన్సు పసిడి ధర ఏకంగా రూ. 2.8 శాతం పెరిగింది. గత వారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో ఆగస్టులో డెలివరీ ఇచ్చే ఔన్స్ బంగారం ధర ఏకంగా 3,364 డాలర్లకు చేరింది. ప్రస్తు తం స్పాట్ మార్కెట్ లో ఔన్స్ పసిడి ధర 3,356.64 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఈ ధర త్వరలోనే 3,500 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్ లోనూ 10 గ్రాముల బంగారం ధర వచ్చే కొద్ది రోజుల్లో రూ.లక్షకు చేరుతుందంటున్నారు.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సుంకాల భయం పట్టుకుంది. పలు దేశాలపై ట్రంప్ అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల సేఫ్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా పసిడి ధర పెరుగుతోంది. ఈ పరిస్థితి మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.