
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారతదేశవ్యాప్తంగా నిన్నటి నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలులోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేంద్రం అమలు చేసినటువంటి ఈ కొత్త జీఎస్టీ స్లాబుల్లో మార్పు ద్వారా మనం వాడే నిత్యవసర సరుకులు నుంచి ఎన్నో వస్తువులు వరకు ధరలు అనేవి తగ్గనున్నాయి. మొన్నటివరకు ప్రతి ఒక్కరు కూడా… రేట్లు తగ్గిన తర్వాత మనకి నచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చని చాలామంది వెయిట్ చేశారు. కానీ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్య ప్రజలకు నేడు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. GST స్లాబుల్లో మార్పులు వలన నిన్నటి నుంచి వస్తువుల ధరలు అన్నీ కూడా తగ్గుతాయని సామాన్య ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ వాళ్ళ ఆశలు అనేవి ఆశగానే మిగిలిపోయేలా ఉన్నాయి.
Read also : ఓడితే ఇంటికే… రసవత్తరంగా సాగునున్న నేటి మ్యాచ్!
మన దేశవ్యాప్తంగా పలు సూపర్ మార్కెట్లు అలాగే పలు దుకాణాల్లో పాత స్టాక్ ను పాత ధరలకే అమ్ముతూ ఉన్నారు. అయితే కేంద్రం జీఎస్టీలలో మార్పులు చేసినప్పుడు ఎమ్మార్పీ రేట్లు మార్చి కొత్త ధరలతో స్టిక్కర్లు వేసి అమ్మాలని చెప్పినా కూడా పలు సూపర్ మార్కెట్లు, పలు దుకాణాలలో పాత రేట్లకే వస్తువులను అమ్ముతున్నారు. కేంద్రం చెప్పిన ఆదేశాలను కొంతమంది యజమానులు ఎక్కడా కూడా పాటించడం లేదు. మరి కొంతమంది సూపర్ మార్కెట్, దుకాణాల యజమానులు కొత్త స్టాక్ వచ్చాకే రేట్లు తగ్గిస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారట. వీళ్లే ఇలా చెప్పడం వల్ల సామాన్య ప్రజలు, వినియోగదారులు నిరాశతో మళ్లీ వెనక్కి తిరిగి వస్తున్నారు. కాగా నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి స్లాబుల్లో ఎన్నో రకాల వస్తువుల మీద తక్కువ జీఎస్టీ తో ధరలు తగ్గాయి. కానీ కొన్ని చోట్ల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ స్లాబ్ ను సరిగా పాటించడం లేదని కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Read also : ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్… ఏపీలో రెచ్చిపోతున్న వర్షాలు!