
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీ లో రాజకీయ వేడి సెగ తగులుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. ఈ సమరంలోనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు రెండుసార్లు ఆప్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకొని 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవి ఢిల్లీలో ఇకపై ఉంటుందో లేదో అన్న అనుమానంతో బిజెపి బాగానే కసరత్తు చేసి ఈసారి గెలిచే తరుణంలో ఉన్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండదు!.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు?
బిజెపికి ఢిల్లీలో గెలుపు అనే పదం 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కానీ ఈసారి కచ్చితంగా ఢిల్లీ అధిష్టానం బిజెపి దేనని చాలా నమ్మకంగా ఉన్నారు పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్ కూడా బిజెపి వైపు మొగ్గు చూపుతుండడంతో బిజెపి కార్యకర్తల మాటలకు బలం చేకూరుతుంది. కాగా ఇవాళ సాయంత్రం ఢిల్లీ ఓటర్ల తెగింపు, మరి ఇన్ని రోజుల నిరీక్షణకు ఢిల్లీ ప్రజలు ఎవరు వైపు ముగ్గు చూపుతారు అని చాలా ఉత్కంఠత నెలకొంది.
అద్దంకి దయాకర్ సినిమా టైటిల్ ఫిక్స్.. పాన్ ఇండియా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!!