
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బందు నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ బంద్ లో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ అలాగే సిపిఎం పార్టీలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బందుకు మద్దతు ఇచ్చాయి. అయితే నేడు జరుగుతున్న ఈ బందులో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉమ్మడిగా పోరాడాల్సిన పార్టీలే నేడు… ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ములుగులో జాతీయ రహదారిపై కాంగ్రెస్ మరియు బిజెపి నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసిన ఘటనలు హైలైట్ గా నిలిచాయి. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ” మోడీ డౌన్ డౌన్ ” అంటూ నినాదాలు చేస్తుంటే మరోవైపు బిజెపి నేతలు ఏమో… ” దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం ” అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అసలు ఈరోజు ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నారో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ప్రతి పార్టీ ఒక్కటై పోరాడాల్సిన తరుణంలో ఇలా ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని కొంతమంది బీసీ సంఘాలు అలాగే బీసీ నేతలు ఇరు పార్టీలపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు ఈ బంద్ దీపావళి పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బంద్ కారణంగా దుకాణదారులకు ఎవరు కూడా వెళ్లడం లేదు. దీంతో దుకాణదారులకు ఆదాయం తగ్గుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : గుడికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పకుండా పాటించండి..!
Read also :తక్షణమే మా దేశం నుంచి వెళ్ళిపోండి.. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు