
Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియకు ఇవాళ(జూన్ 15న) ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్నా, యెమన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం బాధిత కుటుంబంతో నిమిష కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వారి పరిహారం (బ్లడ్ మనీ) తీసుకునేందుకు ఒప్పుకుంటే నిమిష జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ, నిమిష ఎవరు? యెమన్ లో ఎందుకు ఉరిశిక్ష పడిందంటే..
బిజినెస్ పార్ట్ నర్ హత్య!
కేరళకు చెందిన నిమిష నర్సింగ్ కాగానే 2008లో యెమన్ కు వెళ్లింది. అక్కడ కొద్ది కాలం పాటు హాస్పిటల్ లో నర్సుగా పని చేసింది. అదే సమయంలో 2014లో యెమన్ కు చెందిన తలాల్ మహదితో పరిచయం ఏర్పడింది. నిమిష అతడితో కలిసి ఓ మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేశారు. కొంత కాలానికి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె పాస్ పోర్టు తీసుకుని ఇవ్వకుండా టార్చర్ చేశాడు. రోజు రోజుకు అతడి టార్చర్ పెరిగింది.తలాల్ నుంచి తన పాస్ పోర్టును తీసుకోవడంతో పాటు అతడి టార్చర్ నుంచి తట్టుకునేందుకు అతడిని చంపాలనుకుంది. 2017లో అతడికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. అతడి దగ్గర ఉన్న తన పాస్ పోర్టును తీసుకుని ఇండియాకు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 2017 నుంచి జైల్లోనే ఉంది. 2023లో ఆమెకు న్యాయ స్థానం ఉరిశిక్ష విధిచింది.
లాయర్ తిరకాసుతో సమస్య జఠిలం
నిమిష ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఒకే ఆప్షన్ బ్లడ్ మనీ. బాధిత కుటుంబం ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వడం. నిమిషను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సరే అన్నది. నిమిష తరఫు న్యాయవాది 40 వేల డాలర్ల ఫీజు ఇస్తేనే కేసు పరిష్కరిస్తానని చెప్పాడు. రెండు విడతలుగా డబ్బులు ఇచ్చేందుకు నిమిష ఫ్యామిలీ ఓకే చెప్పింది. తొలి విడత ఇచ్చినా, రెండో విడత అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయారు. 2024లె బ్లడ్ మనీ చర్చలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఉరి తీయాలని నిర్ణయించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం, మత పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఉరి తాత్కాలికంగా వాయిదా పడింది.
Read Also: నిమిష ఉరిశిక్ష వాయిదా, యెమన్ సర్కారు సంచలన నిర్ణయం!