సినిమా

ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. నాకు తెలుగొచ్చు : VTV గణేష్

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- తమిళ నటుడు విటీవీ గణేష్ అనగానే ప్రతి ఒక్కరికి.. ” ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్” అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమాతో చాలా పాపులర్ అయిపోయానని కమెడియన్ గణేష్ చాలానే సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఈ కమెడియన్ తమిళ్ చిత్రం ‘కిస్’ లో నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ లో గణేష్ హాజరయ్యారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన తమిళం, హిందీ మరియు తెలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో హాజరైన నటుడు గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీస్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన విజయ్ సార్ కి చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా తరువాత తెలుగులో దాదాపు 8 సినిమాలు చేస్తున్నానని అన్నారు.

Read also : గద్వాల జిల్లాలో దారుణం.. నిద్రలో ఉన్న భర్తపై భార్య దాడి

అయితే ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ కు నా వాయిస్ బదులు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు అని గణేష్ ఫైర్ అయ్యారు. ఇది అసలు కరెక్ట్ కాదు.. సినిమాలలో ఇప్పుడు నా గొంతే నా బలం.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు తెలుగు వచ్చు.. రేపే డబ్బింగ్ చెప్పమన్నా మొత్తం చెప్పేస్తా. నా వాయిస్ మీరు ఎందుకు ఉపయోగించట్లేదు అని దర్శకుడిని అడిగితే.. అతను ఏమో, నాకు తెలియదు చూద్దామని తప్పించుకుంటున్నారు. అదే లేడీ డైరెక్టర్లు అయ్యుంటే.. ఓకే ఒకసారి చెక్ చేసి మళ్ళీ చూద్దామని అనేవారు. కానీ మేల్ డైరెక్టర్లు చాలా ఈజీగా తెలియదు అని చెప్పి తప్పించుకుంటారు. నా క్యారెక్టర్ కు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించడం నాకు అసలు నచ్చలేదు. తెలుగులో ఇప్పటివరకు చేసిన భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ వంటి చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. నా వాయిస్ బాగుంది కదా.. అలాంటప్పుడు వేరే వారిచేత డబ్బింగ్ చెప్పించడమేంటి అని డైరెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు గణేష్. ప్రస్తుతం గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైర్ అవుతున్నాయి.

Read also : దుఃఖంలో కుటుంబం.. ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ నేతలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button