
చండూరు, క్రైమ్ మిర్రర్ :-చండూరు శివారులో ఓ కోళ్ల ఫారం వద్ద పెద్ద మొత్తంలో నకిలీ మద్యం పట్టు పడడంతో చండూరులో సాగుతున్న నకిలీ మద్యం వ్యాపారం పై సర్వత్ర చర్చ నడుస్తుంది. స చండూరు కు చెందిన ఎర్రజల్ల రమేష్, కనగల్ మండలానికి చెందిన భార్గవ్ నాంపల్లి మండలానికి చెందిన మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ దందాలో వివిధ పార్టీలకు చెందిన పెద్దల హస్తం కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మద్యాన్ని తయారుదారులు ఎలా సేల్ చేశారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. మద్యం దుకాణాల ద్వారానే అమ్మకాలు జరిపారా లేక కొంతమంది టీం గా ఏర్పడి బయట బయటనే విక్రయాలు జరిపారా అనేది తేరాల్సి ఉంది.
ఏమైనా శుభకార్యాలు ఫంక్షన్లు ఉంటే తాము మద్యం తక్కువ ధరకే విక్రయిస్తామంటూ చండూరు కు చెందిన కొందరు బిజినెస్ గా మలుచుకున్నారు అనేది విశ్వసనీయ సమాచారం. తమకు మద్యం బయటి ప్రాంతాల నుంచి వస్తుందని….. తక్కువ ధరకే వస్తుందంటూ నమ్మ పలికినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం వ్యవహారంలో పోలీసులు గట్టిగా నిఘ పెట్టి ముమ్మర్ విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఈ వ్యవహారంలో పలువురు పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం దందా కొన్నాళ్లుగా చండూరులో సాగుతూ ఉండడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ప్రియులు చండూరులో కొనాలంటే జంకుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.