
WhatsApp: భారత్ లో 98 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. కేవలం జూన్ లోనే ఈ అకౌంట్స్ ను నిలిపి వేసినట్లు తెలిపింది. మంత్లీ రివ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హనికరమైన ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వాట్సప్ వేదికగా చేసుకుని.. కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది. జూన్ లో 23,596 ఫిర్యాదులు రాగా, వాటిలో 1,001 అకౌంట్స్ పై చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. అందిన ఫిర్యాదుల్లో కొన్ని బ్యాన్ అప్పీళ్లకు లింక్ చేయబడ్డాయని.. 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఈ తరహా చర్యలను ఎప్పుడో ఆపడం కంటే.. ప్రారంభంలోనే నిలిపి వేయడం మంచిదని వాట్సప్ చెప్పుకొచ్చింది.
జనవరిలో 99 లక్షల అకౌంట్స్ బ్యాన్
వాస్తవానికి వాట్సాప్ వినియోగానికి సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించే ప్రయత్నిస్తుట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది జనవరి.. ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల ఇండియన్ అకౌంట్స్ ను వాట్సాప్ నిషేధించింది. ఇప్పటి వరకు ఒక్క నెలలో అన్ని అకౌంట్స్ ను బ్యాన్ చేయడం అదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది.
Read Also: పావురాలకు గింజలు వేస్తే జైలుకే.. హైకోర్టు కీలక ఆదేశాలు!