క్రైమ్

కేటీఆర్ అరెస్ట్ కు డేట్ ఫిక్స్!

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు విచారణలో దూకుడుగా వెళుతున్న ఏసీబీ.. మున్సిపల్ శాఖ ప్రిన్సిప్ల సెక్రెటరీ దాన కిషోర్ ను విచారించింది. ఆయన స్టేట్మెంట్ రికార్డు నమోదు చేసింది ఏసీబీ. దాదాపు 7 గంటల పాటు దానకిషోర్ విచారణ కొనసాగింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఫిర్యాదు చేశారు దాన కిషోర్. 55 కోట్ల రూపాయలను రూల్స్ కు విరుద్దంగా రెండు విడతల్లో చెల్లించారని ఆరోపించారు.

దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ తొ అరవింద్ కుమార్ , Ktr లకు సమన్లు ఇవ్వనుంది ఏసీబీ. విచారణ తర్వాత వాళ్లిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు చేయకుండా కేటీఆర్ హైకోర్టు ఇచ్చిన 10 రోజుల గడువు సోమవారంతో ముగియనుంది. ఆ లోపే కేటీఆర్ ను విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. న్యూఇయర్ గిఫ్ట్ గా కేటీఆర్ అరెస్ట్ ఉండవచ్చనే టాక్ నడుస్తోంది.

 

Back to top button