
Yanamala Rama Krishnudu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజూ హాట్ టాపికే. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అంటే.. టీడీపీ-జనసేన-బీజేపీ అధికారాన్ని, పదవులను పంచుకుంటున్నాయి. దీంతో… చాలా మంది సీనియర్లకు అవకాశాలు రావడం లేదు. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ కొన్ని పదవులను జనసేన, బీజేపీకి ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలోని సీనియర్లకు పదవులు మిస్సవుతున్నాయి. పిఠాపురం టీడీపీ సీనియర్ నేత వర్మ కూడా ఇందులో బాధితుడే. పవన్ కళ్యాణ్ (pawan Kalyan) కోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి… ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకంలో పడేసుకున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. ఆయన ఎవరో కాదు… యనమల రామకృష్ణుడు. (yanamala Rama Krishnudu) ఈయన రాజకీయ భవిష్యత్ ఇప్పుడు చంద్రబాబు చేతుల్లోనే ఉంది.
యనమల రామకృష్ణుడు.. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ. కొన్నిరోజుల్లోనే ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనుక.. యనమల ఎమ్మెల్సీ పదవికి కొనసాగింపు లేదు. దీంతో.. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి…? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభకు వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట యనమల. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు.. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇస్తే వెళ్తానని.. లేదంటే రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తానని సీఎం చంద్రబాబుతో ఆయన చెప్పేశారట. మరి చంద్రబాబు ఏం చేయబోతున్నారు…? యనమలను రాజ్యసభకు పంపుతారా..? లేదా రాజకీయాలకు విరామం ఇచ్చి… విశ్రాంతి తీసుకోమని చెప్తారా..? అన్నది చూడాలి.
[/box Read More :వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి - పిక్చర్ అబీ బాకీహై..!]
యనమల రాజకీయ ప్రస్తానం చూస్తే… 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి… ఆ పార్టీలోనే ఉన్నారు. 43ఏళ్లు ఒకే పార్టీ ఉండటం అంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు. అలాగే… అసెంబ్లీ స్పీకర్‌గానూ సేవలు అందించారు. ఎన్టీఆర్-చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు యనమల. ఆయన కుటుంబసభ్యులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. యనమల కూతురు దివ్య ప్రస్తుతం తుని ఎమ్మెల్యే, అల్లుడు ఏలూరు ఎంపీ. వియ్యంకుడు పుట్టా సుధాకర్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక.. యనమల రాజకీయ భవిష్యత్తే తేలాల్సి ఉంది.