సినిమా

ఏంటి ఈ సినిమా!.. వార్-2 రివ్యూ, ఫ్యాన్స్ కు పూనకాలే

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించినటువంటి సినిమా వార్-2. ఈ సినిమా నేడు ఎన్నో భారీ అంచనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు నడుస్తూ ఉండడంతో.. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయిపోయింది. ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ డాన్స్ కు ఫ్యాన్స్ కి పూనకాలే అని ప్రీమియర్స్ చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలానే పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాలోని యాక్షన్ సీన్స్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి కొన్ని ట్విస్టులు.. ఇక క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయంటూ అభిమానులు పండగ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు వీక్నెస్ లు మాత్రం ఫాన్స్ డైరెక్టుగా చెప్పేస్తున్నారు.

Read also :తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రైల్వేశాఖ కీలక ఆదేశాలు!

ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే విఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర బృందం కాస్త శ్రద్ధ వహిస్తే చాలా బాగుండేది అని ఫాన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా చాలా బాగుంది అని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక బాలీవుడ్ సూపర్ స్టార్, మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్నటువంటి సినిమా కాబట్టి ఒకవైపు తెలుగు రాష్ట్రాల అభిమానులు, మరోవైపు నార్త్ ఇండియా ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ కూడా చాలా వేగంగా నడుస్తున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే నాగార్జున కలిసి నటించినటువంటి సినిమా కూలి. ఈ సినిమా కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మరి కాసేపట్లో క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో రివ్యూ..మీ కోసం..!

Read also : శంషాబాద్‌ లో ప్రతికూల వాతావరణం, విమానాల దారి మళ్లింపు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button