
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో అతనికి ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. చిన్నతనం నుంచి ఫుట్బాల్ మీద ఆసక్తితో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు ప్రపంచవ్యాప్తంగా ఇతను లేకపోతే ఫుట్బాల్ చూడడం కూడా అనవసరం అనుకునే రోజులకు వచ్చాం. అయితే తాజాగా ఈ పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఇందులో ఏముంది అని మీరు అనుకుంటున్నారా?.. అలా అనుకుంటే మాత్రం పొరపాటే.
Read also : పాండ్య మెరుపు ఇన్నింగ్స్.. ఫ్లయింగ్ కిస్ లతో రెచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్
ఇందులో అతను తన ఫుల్ బాడీని పోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసాడు. 40 ఏళ్ల వయసులో కూడా అతను 8 ప్యాక్స్ తో పాటు ఫుల్ ఫిట్గా కనిపిస్తూ ఉన్న ఫోటో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. అతను ప్రతిరోజు డైట్ మరియు ఫిట్నెస్ పట్ల ఎంతటి డెడికేషన్ చూపిస్తున్నారు అనేది ఈ ఫోటో ద్వారా అర్థమవుతుంది అని తన అభిమానులు కొనియాడుతున్నారు. అయితే మరోవైపు అతడి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కేవలం 7% మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో మన భారత పర్యటనకు మెస్సి రాగా ఈసారి క్రిస్టియన్ రోనాల్డో రావాలి అని ఇండియన్ అభిమానులు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
Read also : OM Birla Tea Party: స్పీకర్ టీ పార్టీ.. మోడీ, రాజ్‌నాథ్ తో ప్రియాంక ముచ్చట్లు!





