ఆంధ్ర ప్రదేశ్

కాక రేపుతున్న రాజకీయాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రతి ఒక్కరు కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. ఏపీ రాజకీయాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత అధికార పార్టీ కూటమి ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య గ్యాప్ చాలానే పెరుగుతుంది. ఈ ఇరు పార్టీలు మధ్య పరిస్థితులు రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అధికారం ఉంది కదా అని కూటమి ప్రభుత్వం… మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టబోమని వైసిపి ప్రభుత్వం… ఇలా రెండు పార్టీలు కూడా ఎవరికి వారు శాసించుకునే స్థాయిలోకి వెళ్లిపోయారు. ఇలా చేయడం ఏ పార్టీకి అలాగే రాష్ట్రానికి కూడా మంచిది కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి కక్ష సాధింపుల రాజకీయాలు అనేవి రాష్ట్ర భవిష్యత్తుని లేకుండా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు.

ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు … అంటే రెండు వర్గాలు ఉండడం చాలా కామన్. కానీ కక్షపూరిత చర్యలకు దిగితే మాత్రం… రాష్ట్రాన్ని ముంచడం అన్నట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా వైసిపి అధినేత జగన్మోహన్… మేము అధికారంలోకి వస్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. జగన్ పోలీసులనే కాకుండా అధికారులను కూడా హెచ్చరించారు. కాళ్లు పట్టుకున్న… సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా వదిలిపెట్టనని జగన్ మోహన్ రెడ్డి.. వైసిపి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం పడేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని పరిశీలపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా చాలా సంయమనం పాటించాలని… అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే… భవిష్యత్తులో పార్టీనె నష్టపోతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రజాతీర్పు ఎలా ఉంటుందో ఎవరు కూడా ఊహించడం కష్టమే. కాబట్టి ఇరు పార్టీలు కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్ష హోదాలో ఉన్న… ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలా కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని సూచనలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాలను భవిష్యత్తులో శాసించే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు.

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్‌, పాకిస్తాన్‌… ఎక్స్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button