సినిమా

నితిన్ భవిష్యత్తు ఏంటి… ఇక ఆ ఎల్లమ్మే కాపాడాలి?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమా భవిష్యత్తు ఏంటి అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నితిన్ తీసినటువంటి సినిమాలేవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈమధ్య వచ్చినటువంటి వరుస సినిమాలు యావరేజ్ గా నిలవడంతో నితిన్ సినిమా కెరీర్ ? మార్క్ గా మిగిలిపోయింది. దీంతో నితిన్ గురించి అతని ఫాన్స్ గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. నితిన్ సినిమాలు ఇటీవల వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక సందర్భంలో తమ ఫ్యాన్స్ ను కలవర పెడుతున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచిన మరికొన్ని సినిమాలు అత్తర్ ప్లాప్ అవడంతో.. ఒకవైపు హీరోగా అతను మరోవైపు ఫ్యాన్స్ గా తమ అభిమానులు ఎక్కడ తప్పు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. తాజాగా వచ్చిన రాబిన్ హుడ్ మరియు తమ్ముడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలము అవడంతో ఫ్యాన్స్ తెగ కలవర పడుతున్నారు.

నితిన్ స్టోరీ విషయంలో ఎక్కడ… తప్పును నిర్ణయాలు తీసుకుంటున్నారు అర్థం కావట్లేదు. లేదా కథ బాగున్నా డైరెక్టర్ సరిగా తీయడం లేదా అనే అపోహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అయితే ప్రస్తుతం నితిన్ రెమ్యూనరేషన్ గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే నితిన్ తీస్తున్నటువంటి సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ఇక తన రెమ్యూనరేషన్పై నితిన్ ఒక నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం జబర్దస్త్ వేణు డైరెక్టర్గా తెరకెక్కిస్తున్న సినిమా “ఎల్లమ్మ”. ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరు కూడా తెగ చర్చించుకుంటున్నారు. వేణు గత సంవత్సరంలో తీసినటువంటి బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత విజయాన్ని సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎల్లమ్మ సినిమా కూడా అంతే భారీ హీట్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ సినిమాకి నితిన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా… సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తేనే రెమ్యూనరేషన్ తీసుకుంటారన్నట్లుగా టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. మూవీ కచ్చితంగా హిట్ అయితే మాత్రమే తన రెమ్యూనరేషన్ అడుగుతారన్నట్లుగా నితిన్ భావిస్తున్నట్లు టాలీవుడ్ లో పెద్దగానే చర్చ నడుస్తుంది. మరి ఈ సినిమాతో నైనా టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ కం బ్యాక్ ఇస్తారనేది వేచి చూడాల్సిందే.

రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే?

వరి నారు ఎండకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button